ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ చైర్మన్‌గా అంబికా కృష్ణ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ) చైర్మన్‌గా నిర్మాత అంబికా కృష్ణ నియమితులయ్యారు. బాలకృష్ణ హీరోగా ‘వీరభద్ర’, ఈవీవీ దర్శకత్వంలో ‘కన్యాదానం’, ‘ఆడంతే అదోటైపు’ తదితర సినిమాలను అంబికా కృష్ణ నిర్మించారు. ఏపీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ చైర్మన్‌గా మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉంటారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణకు పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.