‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర | Saloni an important role in 'Resugurram' | Sakshi
Sakshi News home page

‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర

Published Sat, Aug 10 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర

‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర

అల్లు అర్జున్ హీరోగా సురేందర్‌రెడ్ది దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రేసుగుర్రం’లో సలోని ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో బన్నీ సరసన రెండో నాయిక అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఒక్క కథానాయికకే అవకాశం ఉంది. 
 
 ఆ పాత్రను శ్రుతి హాసన్ చేస్తున్నారు. మరి సలోని పాత్ర ఏంటి? ఫిలిమ్‌నగర్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ‘కిక్’శ్యామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్యామ్‌కి జోడీగా సలోని ఎంపికయ్యారు. ఆ మధ్య ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ చిత్రాల్లో కనిపించిన సలోనికి చాలా విరామం తర్వాత వచ్చిన మంచి అవకాశమిది. 
 
 ఇన్నాళ్లూ ఓపిగ్గా ఎదురుచూసిన ఆమెను మంచి అవకాశమే వరించింది. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘రేసుగుర్రం’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement