ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు కీర్తినార్జించి పెట్టిన మునపటి చిత్రం బాజీగర్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి షారూఖ్ తన తోటి నటీ నటులకు, దర్శకుడిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారని షారూఖ్ అన్నారు. ఆ సినిమాలో బ్లాక్ బ్యూటీ కాజోల్, పొడుగాళ్ల సుందరి శిల్పాశెట్టిలు ప్రధాన పాత్రలు కాగా, షారూఖ్ ది మాత్రం నెగిటివ్ రోల్. ఆ పాత్రలో కూడా షారూఖ్ హీరోయిజాన్ని ప్రదర్శించారు.
ఈ చిత్రంలో డైలాగ్ లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగానే ఉంటాయి. ఓడి గెలిచినవాడే బాజీగర్(అభీ భీ హర్కర్ జీత్నేవాలే కో బాజీగర్ క్యహతే హైన్) అనే డైలాగ్ కు విశేష ఆదరణ లభించింది. వీటిన ఒకసారి గుర్తు చేసుకున్నషారూఖ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనాటి టీంకు కృతజ్జతలు తెలియజేశాడు. ఇప్పటికీ దూకుడుమీద ఉన్న షారూఖ్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.