"షటప్ యువర్ మౌత్'' అంటున్న శ్రుతిహాసన్
"షటప్ యువర్ మౌత్'' అంటున్న శ్రుతిహాసన్
Published Fri, Aug 9 2013 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘షటప్ యువర్ మౌత్’ అని ఓ రేంజ్‌లో సీరియస్ అయిపోయారు శ్రుతిహాసన్. ఈ పాలబుగ్గల వయ్యారికి అంత కోపం రావడానికి కారణం ఏమై ఉంటుందా! అనుకుంటున్నారా? సరే... అసలు విషయంలోకెళదాం. తెలుగులో ఘన విజయం సాధించిన ‘అలా మొదలైంది’ చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది.
‘కడలి’ఫేం గౌతమ్ కార్తీక్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో... స్వతహాగా మంచి గాయని అయిన శ్రుతిహాసన్‌తో ఓ పాట పాడించేశారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. ఆ పాట ప్రారంభంలో వచ్చే పదం ‘షటప్ యువర్ మౌత్’. ఈ పాట తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆ చిత్రం యూనిట్ సమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
గబ్బర్‌సింగ్, బలుపు, డి-డే చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో సక్సెస్‌లు కొట్టేసి, నటిగా మంచి ఊపుమీదున్న శ్రుతి... ఈ పాటతో గాయనిగా కూడా బిజీ అయిపోతారని కోలీవుడ్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. శ్రుతి ఈ పాట గురించి మాట్లాడుతూ -‘‘త్వరగా శ్రోతల్లోకి వెళ్లిపోయే క్యాచీ సాంగ్ ఇది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాట పాడాను. ఇప్పటికే చాలా పాటలు పాడిన నాకు ఓ గమ్మత్తై అనుభూతిని అందించిన పాట ఇది’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement