వండర్ వుమెన్ను దాటేసిన స్పైడర్ మ్యాన్ | Spyderaman Home Coming First Day collections | Sakshi
Sakshi News home page

వండర్ వుమెన్ను దాటేసిన స్పైడర్ మ్యాన్

Published Sat, Jul 8 2017 1:39 PM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

వండర్ వుమెన్ను దాటేసిన స్పైడర్ మ్యాన్ - Sakshi

వండర్ వుమెన్ను దాటేసిన స్పైడర్ మ్యాన్

హాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరీస్గా గుర్తింపు తెచ్చుకున్న స్పైడర్ మ్యాన్ సీరీస్లో కొత్త సినిమా స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మరోసారి గత రికార్డ్ లను తిరగరాస్తూ సంచలనాలు నమోదు చేస్తోంది. ముందు రోజు వేసిన ప్రీమియర్లతో కలిపి ఏకంగా 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది స్పైడర్ మ్యాన్ హోం కమింగ్.

ట్రేడ్ ఎనలిస్ట్లు కూడా ఈ సినిమా ఫస్ట్ డే 85 మిలియన్ డాలర్లు మాత్రమే సాధిస్తుందని అంచనా వేశారు అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రావటంతో స్పైడర్ మ్యాన్ ఏకంగా 110 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించింది. ఇటీవల ఘనవిజయం సాధించిన వండర్ వుమెన్ 103 మిలయన్ల డాలర్లతో సృష్టించిన రికార్డ్ను కేవలం నెల రోజుల గ్యాప్లో స్పైడర్ మ్యాన్ బద్ధలు కొట్టడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement