బిగ్‌బాస్‌ హోస్ట్‌పై ‘స్టార్‌ మా’ ప్రకటన | Star Maa Confirmed Nagarjuna Host The Bigg Boss Telugu Season 3 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ హోస్ట్‌పై ‘స్టార్‌ మా’ ప్రకటన

Published Fri, Jun 28 2019 8:26 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Star Maa Confirmed Nagarjuna Host The Bigg Boss Telugu Season 3 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత రెండు సీజన్లుగా తెలుగు నాట బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు హోస్ట్‌గా కింగ్‌ నాగర్జున వ్యవహరిస్తున్నట్టుగా పలు వార్తలు వచ్చాయి. దీనిపై అటూ స్టార్‌ మా గానీ, నాగర్జున నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో నాగర్జున ఈ సారి బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని అంతా ఫిక్స్‌ అయ్యారు. అయితే దీనిపై స్టార్‌ మా తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది. నాగార్జున మీద చిత్రీకరించిన ఓ ప్రోమోను శుక్రవారం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఈ సారి రంగంలోకి దిగేది నాగర్జున అంటూ స్టార్‌ మా ప్రకటించింది. ‘ఆకలేస్తే తింటారు.. అలిగితే వాటితోనే కొట్టుకుంటారు’, ‘నవ నవ లాడే లేత వంకాయలు ఓ పాతిక కిలోలు ఇవ్వు’ అంటూ నాగర్జున బిగ్‌బాస్‌ హౌస్‌ మెంబర్స్‌ కోసం సరకులు కొంటున్నట్టుగా ఇందులో చూపించారు. షోలో 14 మంది కంటెస్టెంట్లు ఉండనున్నట్టు, 100 రోజుల సాగనున్నట్టు నాగార్జున ఈ ప్రోమోలో తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక ఈ మూడో సీజన్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోందని, అయితే సామాన్యుడికి ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ లేదని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్ల వివరాలు అధికారికంగా బయటకు రాకపోవడంతో.. ఇప్పటికీ ఊహాగానాలతో ఎవరికి వారు ఓ లిస్ట్‌ను తయారు చేసి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. త్వరలోనే కంటెస్టెంట్ల వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. జూలైలో బిగ్‌బాస్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement