రాయభారీలో భారీ యాక్షన్ | Thrilling ski Fight sequence in krish, varun rayabhari | Sakshi
Sakshi News home page

రాయభారీలో భారీ యాక్షన్

Published Thu, Feb 4 2016 8:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

రాయభారీలో భారీ యాక్షన్

రాయభారీలో భారీ యాక్షన్

కంచె సినిమాతో మంచి సక్సెస్ సాధించిన హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్ మరోసారి కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. కంచె తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించని క్రిష్ మరోసారి వరుణ్ హీరోగా డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. లోఫర్ సినిమాతో కమర్షియల్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ఈ సినిమాలో గూడచారి పాత్రలో కనిపించనున్నాడు.

ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను జార్జియాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ భారీ స్కీ ఫైట్ సీక్వన్స్ ఉంది. జార్జీయాలోని వాతావరణం ఆ ఫైట్ సీక్వన్స్కు సూట్ అవుతుందన్న ఆలోచనతో అక్కడే సినిమాను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన కంచె సినిమాను కూడా జార్జీయాలోనే షూట్ చేశారు. మరోసారి వరుణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement