కోటి దాటితేనే... | Trisha demands 1.25 Crore Remuneration | Sakshi
Sakshi News home page

కోటి దాటితేనే...

Published Wed, Jul 30 2014 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కోటి దాటితేనే... - Sakshi

కోటి దాటితేనే...

 కథ, కథానాయకుడి కంటే కథానాయికల పారితోషికమే ప్రధానం అని భావిస్తున్నారని త్రిష లాంటివారిని చూస్తే అర్థం అవుతుంది. వీళ్లంతా కథ బాగుంటే పారితోషికం పెద్ద సమస్యే కాదని బడాయి మాటలు చెప్పినవారే. ఇప్పుడు కోటి 25 లక్షలు పారితోషికం ఇస్తే కాల్‌షీట్స్ రెడీ అంటూ నటి త్రిష కండిషన్ పెట్టినట్లు సమాచారం. సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ ప్రస్తుతం ఆయన కొడుకు చార్మింగ్ హీరో అయిన ప్రశాంత్‌తో సాహసం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తదుపరి బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాది భాషలలో రీమేక్ చేయడానికి సన్నాహాలుచేస్తున్నారు. హిందీలో కంగనా రనౌత్ నటించిన పాత్రను దక్షిణాదిలో పోషించే ప్రముఖ హీరోయిన్ లిస్ట్‌లో చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
 
 సమంత, త్రిష, హన్సిక, చార్మిల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ క్వీన్ ఎవరన్నది నిర్ణయం కాలేదు. నిజానికి ఈ పాత్రలో నటించడానికి ఎంతో స్కోప్ ఉంది. ఇంకా చెప్పాలంటే క్వీన్ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం, అది సెన్సేషనల్ చిత్రంగా ప్రూవ్  చేసుకుంది కూడా. అలాంటి చిత్రం లో నటించమని త్రిషను అడగ్గా కథ విన్న ఈ జాణ ఓకే బాగుంది కాల్‌షీట్ కేటాయించడానికి సిద్ధం. అయితే పారితోషికం మాత్రం కోటింపావు కావాలి అంటూ డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ సమాచారం. దీంతో ఈ అమ్మడిని ఓకే చెయ్యాలా వద్దా అన్న విషయం గురించి చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement