మొదటిసారి రోహిత్‌లో ఈ యాంగిల్ చూశా! | Tuntari Telugu Movie Audio Launched | Sakshi
Sakshi News home page

మొదటిసారి రోహిత్‌లో ఈ యాంగిల్ చూశా!

Published Sat, Feb 20 2016 10:50 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

మొదటిసారి రోహిత్‌లో ఈ యాంగిల్ చూశా! - Sakshi

మొదటిసారి రోహిత్‌లో ఈ యాంగిల్ చూశా!

 ‘‘ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. ఫస్ట్ టైమ్ నారా రోహిత్‌లో కామెడీ యాంగిల్ చూశా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. నారా రోహిత్, లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ పతాకంపై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా, నాగార్జున నిర్మించిన చిత్రం ‘తుంటరి’. సాయి కార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘తమిళంలో మురుగదాస్‌గారు కథ అందించిన ‘మాన్ కరాటే’ చిత్రానికి ఈ సినిమా రీమేక్. ఇలాంటి కథను తీసుకొచ్చి నాతో చేసిన దర్శక, నిర్మాతలకు చాలా థ్యాంక్స్.
 
 నేను ఇప్పటి వరకూ కాస్త డిఫరెంట్ మూవీస్ చేశా. ఇది కూడా కొత్త తరహా మూవీనే. అయితే, నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నాకు నారా రోహిత్ అంటే చాలా ఇష్టం.  ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. తనతో సినిమా చేయాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు శ్రీవాస్ అన్నారు. ఈ వేడుకలో రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి, హీరో తారకరత్న, సంగీత దర్శకుడు సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement