బ్రహ్మాండమైన సెట్స్‌లో కత్తిసండై | vishal and tamanna act new movie | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండమైన సెట్స్‌లో కత్తిసండై

Published Fri, Aug 12 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

బ్రహ్మాండమైన సెట్స్‌లో కత్తిసండై

బ్రహ్మాండమైన సెట్స్‌లో కత్తిసండై

బ్రహ్మాండమైన సెట్స్‌లో విశాల్ తమన్నాల కత్తిసండై చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ అధినేత ఎస్.నందగోపాల్ తాజాగా నటుడు విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజీ, విశాల్, తమన్నా జంటగా కత్తిసండై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వీటిలో కత్తిసండై చిత్రానికి సురాజ్ కథ, కథనం, మాటలు, దర్వకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. కాగా చాలా కాలం తరువాత నటుడు వడివేలు హాస్య పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. మరో హాస్యనటుడు సూరి కూడా నటించడం విశేషం.ఇతర ముఖ్యపాత్రల్లో జగపతిబాబు,తరుణ్‌ఆరోరా, చరణ్‌దీప్, జయప్రకాశ్, నిరోషా, దాడిబాలాజీ,ఆర్తీ నటిస్తున్నారు.

హిప్ హాప్ తమిళ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది పక్కా మాస్ ఎంటర్‌టెయినర్‌గా రూపొందిస్తున్న చిత్రం అని తెలిపారు. చిత్రంలోని పాటలు, పోరాట సన్నివేశాలు, ఇతర ముఖ్య సన్నివేశాల కోసం బ్రహ్మాండమైన సెట్స్ వేసి అందులో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఇది విశాల్ చిత్రాలన్నిటి కంటే భారీ బడ్జెట్ చిత్రం అన్నారు.చిత్రంలో తొలి భాగంలో సూరి, రెండో భాగంలో వడివేలు హాస్యరసంతో కడుపుబ్బ న వ్విస్తారన్నారు. చిత్రాన్ని దీపావళికి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement