ఢిల్లీ:నీటి వనరుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జల మంథన్ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. పోలవరం కుడి కాల్వ నుంచి గోదావరి జలాను కృష్ణా నదిలోకి తీసుకెళ్తామన్నారు.ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అనుసంధానం వల్ల వృథాగా వెళ్లే నీటిని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.
దీన్ని పోలవరం కంటే ముందే ఎనిమిది నెలల్లోనే పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. నీటి వనరుల్లో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహాయం అందజేస్తామని కేంద్ర మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి ఢిల్లీలో మూడు రోజులపాటు ‘జల్ మంథన్’ పేరుతో జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.