రజనీతో చిదంబరం భేటీ | Chidambaram held a meeting with Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీతో చిదంబరం భేటీ

Published Wed, Dec 28 2016 2:48 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

రజనీతో చిదంబరం భేటీ

రజనీతో చిదంబరం భేటీ

టీనగర్‌ (చెన్నై): సినీ నటుడు రజనీకాంత్‌ను కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం మంగళవారం కలిశారు. చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటికి వచ్చిన చిదంబరానికి రజనీ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు గురించి వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ స్వతహాగా ఏ రాజకీయ పార్టీకీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించడం లేదు.

అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు రజనీకాంత్‌ పట్ల ప్రత్యేక గౌరవం, అభిమానాలున్నాయి. దీంతో అనేక పార్టీలకు చెందిన ప్రముఖులు తరచూ రజనీకాంత్‌ను కలుసుకుని చర్చలు జరుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే చిదంబరం.. రజనీని కలిశారు. నేటి ఆర్థిక రంగం పరిస్థితి, కరెన్సీ నోట్ల రద్దుతో ఎదురైన ఇబ్బందులు, దీంతో భారత ఆర్థిక రంగం ఎలా అంధకారంలో కూరుకుపోతోందో రజనీకాంత్‌కు పి.చిదంబరం వివరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement