మీరట్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన ఓ నాయకుడు ఏర్పాటు చేసిన హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. 'యోగి యోగి అనే మంత్రం జపించండి లేదా యూపీ విడిచి వెళ్లిపోండి' అంటూ మీరట్‌లోని ముఖ్య ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ప్రజాప్రతినిధులతోపాటు అధికారుల ఇళ్ల వద్ద వీటిని ఉంచారు. జిల్లా పోలీస్ కమిషనర్ నివాసం ఎదుట కూడా వీటిని ఏర్పాటు చేయటం అంతటా చర్చనీయాంశమయింది.
ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తోపాటు మీరట్ జిల్లా హిందూ వాహిని అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న నీరజ్ శర్మ పంచాలీ ఫొటోలు ఈ హోర్డింగులపై ఉన్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఇంటలిజెన్స్ విభాగాన్ని ఆదేశించినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్ర గౌర్ తెలిపారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. హిందూ వాహిని రాష్ట్ర నేత నాగేంద్ర ప్రతాప్ సింగ్‌ను వివరణ కోరగా.. నీరజ్ శర్మ పంచాలీతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. నెల క్రితమే ఆయన్ను సంస్థ నుంచి బహిష్కరించినట్లు వివరించారు. హిందూవాహినిని అప్రతిష్టపాలు చేయటానికే ఆయన ఇటువంటి చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు.
యూపీలో హోర్డింగ్‌ల కలకలం
Published Sat, Apr 15 2017 6:40 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
Advertisement
Advertisement