బెంగళూరు: ఇటీవల హత్యకు గురైన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్‌కు రష్యా అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు (మరణానంతరం)ను ప్రకటించింది. ఈ సమాచారం గురువారం తమకు ఈ–మెయిల్ ద్వారా అందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అవార్డు పొందనున్న తొలి భారతీయురాలిగా లంకేశ్ నిలవనున్నారు.
2006లో మాస్కోలో హత్యకు గురైన ప్రముఖ మహిళా జర్నలిస్టు పొలిట్‌కోవస్కయా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును లంకేశ్, పాకిస్తాన్ హక్కుల కార్యకర్త గులాలాయ్ ఇస్మాయిల్‌లకు ఈ ఏడాది సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి చెచెన్యాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలు ప్రచురించినందుకు పొలిట్‌కోవస్కయాను విషమిచ్చి హత్య చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకే ప్రత్యేకంగా ఆమె పేరిట ఈ అవార్డును నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment