సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు 5 లక్షలు దాటాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా గత 24 గంటల్లో దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కొత్తగా 18,552 కేసులు నమోదు కాగా, 384 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో 5,08,953 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 2,95,881 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 15,685 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,97,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ఉన్నాయి.
కాగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలో కరోనా కేసులు 25.5 లక్షలు దాటగా, బ్రెజిల్ 13 లక్షల కేసుల దిశగా పరుగులు పెడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 99,03,986కి చేరింది. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు మొత్తం 4,96,845 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 5062 మంది మృతిచెందారు. కరోనా బారినపడిన వారిలో 53,57,233 మంది కోలుకోగా, 40,49,908 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 5 లక్షల కేసులతో నాలుగో స్థానంలో ఉండగా మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment