వైరల్: ఈ‌ మెసేజ్‌ చదవాలంటే మీ ఫోన్‌ను.. | Lockdown: Mumbai Police Hidden Twist Message For People | Sakshi
Sakshi News home page

ఈ మెసేజ్‌ చదవటానికి మీరేం చేయాలంటే?

Published Wed, Apr 29 2020 5:47 PM | Last Updated on Wed, Apr 29 2020 6:01 PM

Lockdown: Mumbai Police Hidden Twist Message For People - Sakshi

ముంబై : కరోనా లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముంబై పోలీసులు కొత్తకొత్త టెక్నిక్‌లు ఫాలో అవుతున్నారు. తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ సర్‌ప్రైజ్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ మెసేజ్‌ను మనం మామూలుగా చదవలేం.. అందుకే పూర్తి నల్ల రంగులో ఉన్న దాన్ని చదవటానికి మన సెల్‌ఫోన్‌లో బ్రైట్‌నెస్‌ను బాగా పెంచాల్సి ఉంటుంది. అ‍ప్పుడు అందులో దాగి ఉన్న ట్విస్ట్‌ మనకు అర్థమవుతుంది. కొన్ని గంటల క్రితం పోస్టైన ఈ హిడెన్‌ ట్విస్ట్‌ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మెసేజ్‌ ప్రముఖ బాలీవుడ్‌ కామెడీ క్యారెక్టర్‌ డైలాగ్‌ను పోలి ఉండటంతో నెటిజన్లు ‘‘ డార్క్‌ హ్యూమర్‌.. ఇది బాబు రావ్‌ స్టైల్‌..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ క్యారెక్టర్‌ గురించి తెలియని వారు అందులో ఉన్న తప్పును ఎత్తి చూపుతున్నారు. ( ఆన్‌లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి క‌ట్టాడు )

చదవండి : కరోనా: అద్భుతమైన వార్త.. మిరాకిల్‌ బేబీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement