రాహుల్ మాటలపై ఆగని రగడ
ముంబై: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హత వేటు నుంచి కాపాడేందుకు కేంద్రం చేసిన ఆర్డినెన్‌స మతిలేని చర్య అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపిన దుమారం కొనసాగుతూనే ఉంది. ప్రధాని తన ఆత్మప్రబోధానుసారం నడచుకుని పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. వివాదాస్పద ఆర్డినెన్‌సపై చర్చించడానికి వీలుగా యూపీఏ సమన్వయ కమిటీని సమావేశపరచాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. యూపీఏలో ప్రజాప్రతినిధులు అందరి విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆర్డినెన్‌సపై నెలకొన్న వివాదాన్ని తొలగించాలని ఒమర్ శ్రీనగర్‌లో మీడియాతో చెప్పారు. యూపీఏలో మరో భాగస్వామ్య పక్షం ఎన్‌సీపీ మాత్రం ఈ వివాదం దురదృష్టకరమంటూ పేర్కొంది.
ఈ వ్యవహారాన్ని చక్కగా నిర్వహించి ఉండాల్సిందని ఎన్‌సీపీ నేత, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. ‘‘ఆత్మప్రబోధానుసారం నడచుకోవాలన్న నా విజ్ఞప్తిని ప్రధాని అంగీకరిస్తే ఢిల్లీలో అడుగు పెట్టిన వెంటనే (అమెరికా నుంచి) ఆయన నేరుగా రాష్టప్రతి భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించాలి’’ అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఈ అంశం మన్మో„హన్‌సింగ్‌కు సంబంధించినది కాదని, ఈ దేశ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)కు సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు. రాహుల్ విమర్శలు పీఎంవో గౌరవాన్ని మంటగలిపాయని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధానికి ఏ కొంచెం ఆత్మగౌరవం, సిగ్గు ఉన్నా మంత్రివర్గంతోపాటు అధికారం నుంచి వైదొలగాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. ఆర్డినెన్‌స మంచైనా, చెడైనా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. ప్రధానికి అసలు బాస్ ఎవరో తెలియజెప్పడమే రాహుల్ వ్యాఖ్యల పరమార్థమని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఇక ప్రధాని ఆర్డినెన్‌సను ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల కొత్త నిర్వచనాలు
ఆర్డినెన్‌సపై రాహుల్ విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమని కేంద్ర మంత్రి మిలింద్ దేవ్‌రా అన్నారు. తప్పులను అంగీకరించచడం, సరిచేసుకోవడం ఏమాత్రం తప్పు కాదని చెప్పారు. పనిలో పనిగా బీజేపీపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఆర్డినెన్‌సను కాంగ్రెస్-ప్రభుత్వ అంశంగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి జీకేవాసన్ మాత్రం రాహుల్ పార్టీ అభిప్రాయాన్ని, దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేశారని పేర్కొన్నారు. అధిక శాతం మంది ప్రజల అభిప్రాయాలను రాహుల్ వ్యక్తపరిచారని, వాటిని విమర్శలుగా చూడరాదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు.
ఉపసంహరణే తరువాయి?
ఇంటా బయటా అగ్గిరాజేసిన ఆర్డినెన్‌సపై చర్చించడానికి కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3 లేదా 4న సమావేశమయ్యే అవకాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దోషులైన ప్రజాప్రతినిధులను తక్షణ అనర్హత వేటు నుంచి కాపాడే ఈ ఆర్డినెన్‌సను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ తీవ్ర విమర్శలు చేయడం, వాటిని పార్టీ, దేశ ప్రజల అభిప్రాయాలుగా పార్లమెంటరీ వ్యవ„హారాల మంత్రి సహా పలువురు పేర్కొనడం దీనికి సంకేతంగా చెబుతున్నారు. పాత మిత్రులు మళ్లీ కలుస్తారు