కొడుకుతో కలిసి పరుగెత్తిన అమ్మ | Milind Soman's Mom is as Cool as Him. She Runs With Him, Wearing a Sari | Sakshi
Sakshi News home page

కొడుకుతో కలిసి పరుగెత్తిన అమ్మ

Published Thu, Aug 4 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

కొడుకుతో కలిసి పరుగెత్తిన అమ్మ

కొడుకుతో కలిసి పరుగెత్తిన అమ్మ

అహ్మదాబాద్: వృద్ధాప్యంలో ఎవరైనా కృష్ణారామ అంటూ గడిపేస్తారు. ఆమె అందరిలా కాదు. 78 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ మరీ పరిగెత్తారు. తన కొడుకుతో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ రన్'లో పాలు పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు. భారత మాజీ సూపర్ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తల్లి ఉష. అహ్మదాబాద్ నుంచి ముంబైకి మిలింద్ చేపట్టిన 'ది గ్రేట్ ఇండియన్ రన్'లో కొడుకుతో కలిసి ఆమె కొంత దూరం పరిగెత్తారు.

కాళ్లకు చెప్పులు, బూట్లు లేకుండా చీరకట్టుకుని మరీ ఆమె రన్ లో పాల్గొనడం విశేషం. మహారాష్ట్రలోని మనోర్ ప్రాంతంలో మిలింద్ తో కలిసి ఆమె పరుగెత్తారు. తల్లితో  పరుగుపెడుతున్న వీడియోను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 8 రోజుల్లోనే అతడు 'ది గ్రేట్ ఇండియన్ రన్' పూర్తి చేశాడు. పరుగు ద్వారా అహ్మదాబాద్ నుంచి ముంబైకి అతడు చేరుకోవడం ఇది మూడోసారి. కాళ్లకు జాగింగ్ బూట్లు గానీ, పాదరక్షలు గానీ లేకుండా అతడు పరుగెత్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement