వాషింగ్టన్లోని శ్వేతసౌధంలో నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా
వాసింగ్టన్:'థాంక్యూ అమెరికా' అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ముగించారు. ఐదు రోజుల పాటు ఊపిరి సలపనంతగా వరుస కార్యక్రమాలతో బిజీగా గడిపిన ప్రధాని బుధవారం భారత్ తిరుగుప్రయాణమయ్యారు. అమెరికా పర్యటన విజయవంతంగా, సంతప్తికరంగా సాగిందని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. తన పర్యటన ద్వారా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత సంబంధాలను, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మోదీ మెరుగుపర్చుకోగలిగారని యూఎస్‌లోని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను, అంతర్జాతీయ అంశాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా రెండు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. పరస్పర సహకారంతో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.
**