ఒబామాతో ప్రధాని మోదీ భేటీ
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ అగ్రదేశాధినేతలతో సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ భేటీ అయ్యారు.
ఏడాదికాలంలో ఈ ఇద్దరు నేతలూ కలవడమిది మూడోసారి. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల గురించి మోదీ, ఒబామా దాదాపు గంటా పది నిమిషాల పాటు చర్చించనున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ అంతకుముందు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండెలతో సమావేశమయ్యారు.