కుప్పకూలిన హర్యానా గవర్నర్ విమానం | Providential escape for Haryana governor | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన హర్యానా గవర్నర్ విమానం

Published Thu, Mar 27 2014 4:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

కుప్పకూలిన హర్యానా గవర్నర్ విమానం

కుప్పకూలిన హర్యానా గవర్నర్ విమానం

హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రమాదానికి గురైంది.

గవర్నర్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ తరువాత దాదాపు ఇరవై అడుగుల ఎత్తు ఎగరగానే మంటలు అంటుకుంది. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వెంటనే విమానం రన్ వే పైనే కుప్పకూలిపోయింది. విమానంలో గవర్నర్ సహా అయిదుగురు వ్యక్తులున్నారు. మిగతా సిబ్బంది వెంటనే గవర్నర్ ను విమానం నుంచి బయటకు తీసుకొచ్చారు. మిగతా ప్రయాణికులకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.

గవర్నర్ ఢిల్లీ కి బయలుదేరుతూండగా ఈ సంఘటన జరిగింది. గవర్నర్ ను వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్ టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement