రూ. 20 కోట్ల డ్రగ్స్ పట్టివేత
కొచ్చి: కొచ్చి అంతర్జాతీయ విమనాశ్రయంలో భారీ ఎత్తున మత్తు మందు పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ వద్ద నుంచి సుమారు 14 కిలోల డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
కొచ్చి నుంచి దోహా వెళుతుండగా దక్షిణాఫ్రికా మహిళ బ్యాగు తనిఖీ చేసినపుడు 14.580 కేజీల మత్తు మందును కనుగొన్నామని, వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామన్నారు. మత్తు మందుల అక్రమ రవాణా చేసే డ్రగ్ రాకెట్తో ఈ మహిళకు ఏమైనా సంబంధాలున్నాయో అనే కోణంలో విచారణ చేపట్టామని తెలిపారు.