సోదరిపై లైంగిక వేధింపులు.. అందుకే ఆ హత్యలు! | Thane Man Who Killed 14 Of His Family May Have Sexually Abused Sister | Sakshi
Sakshi News home page

సోదరిపై లైంగిక వేధింపులు.. అందుకే ఆ హత్యలు!

Published Sun, Mar 6 2016 12:30 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

సోదరిపై లైంగిక వేధింపులు.. అందుకే ఆ హత్యలు! - Sakshi

సోదరిపై లైంగిక వేధింపులు.. అందుకే ఆ హత్యలు!

థానే: సొంత కుటుంబ సభ్యలను 14 మందిని అత్యంత దారుణంగా హత్య చేసి.. తనూ ఆత్మహత్య చేసుకున్న హుస్నేన్ వారేకర్ గురించి ఆదివారం పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. థానే సమీపంలోని వారేకర్ ఇంట్లో దొరికిన మందులను బట్టి చూస్తే.. అతని మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలుస్తోందని, అలాగే అతను తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలిందని జాయింట్ కమిషనర్ అశుతోష్ వెల్లడించారు. వారేకర్ ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేదని, అతడు సమారు 65 లక్షల రూపాయలు సమీప బందువుల వద్ద అప్పుచేశాడని ఆయన వెల్లడించారు.

సోదరిని లైంగికంగా వేధించిన విషయం కుటుంబసభ్యులకు తెలియటంతోనే అందరినీ చంపాలని వారేకర్ భావించి ఉంటాడని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన సుబియా బర్మార్ పోలీసులతో వెల్లడించింది. ఘటన సమయంలో వారేకర్ తల్లి ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ అతను ఆమెను విడిచిపెట్టలేదని సుబియా విచారణలో తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement