గూగుల్‌పై కేసు
► అభ్యంతర జాబితాలో మోదీ పేరు
షాజహాన్‌పూర్ (యూపీ): ప్రధాని మోదీ పేరును 2015లో అభ్యంతరకరమైన జాబితాలో చేర్చి ఫలితాలు అందించినందుకు ఆన్‌లైన్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌పై కేసు నమోదైంది.
నంద్‌కిషోర్ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు నగర ఎస్పీ కమల్ కిషోర్ మీడియాకు తెలిపారు. ఈ విషయమై నంద్‌కిషోర్ మాట్లాడుతూ, తాను 2015లో గూగుల్‌లో జాతీయ వార్తల్ని సెర్చ్ చేస్తుండగా ప్రధాని మోదీ పేరును అభ్యంతరకరమైన జాబితాలో సదరు సంస్థ చేర్చిందని ఆరోపించారు. దీంతో తనతో పాటు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు.