చిరునవ్వుల బాల్యం-చిగురించు దేశం | november 14th jawaharlal nehru birth aniversary | Sakshi
Sakshi News home page

చిరునవ్వుల బాల్యం-చిగురించు దేశం

Published Sat, Nov 14 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

november 14th jawaharlal nehru birth aniversary

సందర్భం
 
బాల్యం ఒక అంద మైన మధురానుభూతి. మరోజన్మ అనేది ఉంటే బాల్యాన్ని మళ్లీ అనుభ వించాలనే స్వప్నం అం దరికీ ఉంటుంది. ముక్కు పచ్చలారని బాల్యంలో తెలిసీ తెలి యని వయసులోని అత్యధికులకు బాల్యం ఒక పీడకలగా, వారి బతుకు తీరని వ్యథగా మిగిలిపోతున్నది. ‘‘మెరు పు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా’’ అని శ్రీశ్రీ రాసిన శైశవగీతం ఈ చిన్నారులకు వర్తించవు.

బాలకార్మిక వ్యవస్థపై పోరాడిన మలాలా, కైలాస్ సత్యార్థిలకు సంయుక్తంగా 2014లో నోబెల్ శాంతి బహుమతి రావటంతో బాలకా ర్మిక వ్యవస్థపైకి ప్రపంచం దృష్టి మళ్లింది. ఇటీవల సుప్రీంకోర్టు పిల్లల అక్రమ రవాణాపై సమా జాన్ని, ప్రభుత్వాలను కలిపి మీ పిల్లలే కనిపించ కుండా పోతే ఇలాగే స్పందిస్తారా అని ఘాటుగా ప్రశ్నించడంతో బాలకార్మిక వ్యవస్థ విషయంలో వ్యవస్థాగత లోపాల గురించి సర్వత్రా చర్చకు తెర లేచింది. ఏటా నవంబర్ 14ను బాలల దినోత్స వంగా జరుపుకుంటున్నాం. కానీ ఎందరో బాలలు మన కళ్లముందే బాల్యానికే నోచుకోలేక కునారిల్లిపోతున్నారు. మధురమైన బాల్యాన్ని ఆనందించలేకపోతున్నారు.

గ్లోబల్ మార్చ్  అగెనైస్ట్ చైల్డ్ లేబర్ పేరుతో సత్యార్థి ప్రకాశ్ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో ఏటా 22 లక్షల మంది, నిమిషానికి నలుగురు పిల్లలు అదృశ్యమ వుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 12 లక్షల మంది చిన్నపిల్లల అక్రమ రవాణా జరుగుతోంది. పైగా బాలల అక్రమ రవాణాకు భారత్ కేంద్రంగా మారిందని అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ నివేదిక పేర్కొంది. పిల్లలను అవయవదాతలుగా మార్చి, మానవత్వం లేకుండా హతమారుస్తూ కాసులు సంపాదిస్తున్నారని సత్యార్థి అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.

మరోవైపున దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో బడిలో ఉండాల్సిన 5-14 ఏళ్ల పిల్లలు పత్తి చేలలో, బీడీ పరిశ్రమలలో, షాపుల్లో, హోటళ్లలో, ఇళ్లలో, పూలతోటల్లో, పశువుల కాపర్లుగా, బడికీ, బాల్యానికీ దూరమై బతుకీడుస్తున్నారు. గ్రామీణ భారతంలో కనిపిస్తున్న బాల కార్మిక వ్యవస్థ  ఇలా ఉండగా పట్టణాల్లో అభివృద్థి కారణంగా పారిశ్రామికవాడలు బాలకార్మికులతో నిండిపో యాయి.

ఫిరోజాబాద్ గాజు పరిశ్రమల్లో, జైపూ ర్‌లో రాళ్లు కొట్టే పనిలో, దక్షిణ శివకాశి బాణ సంచా తయారీలో, సూరత్‌లో వజ్రాల చెక్కు డులో, ఆలీగఢ్ తాళాల తయారీలో, తిరువ ట్రూరు ఇటుకబట్టీల్లో రసాయనాలతో కాలిపోయే చిన్నా రుల బతుకుల గురించి ఇలా చెప్పుకుంటూ వెళితే, ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తాయి. అందంగా రంగుల ప్రపం చంలో అభివృద్ధికి చిహ్నంగా కనిపించే భవంతుల మధ్య చింపిరి జుట్లతో, చిరిగిన గుడ్డలతో, ఎండిన ఆకులతో చిత్తుకాగితాలను ఏరుకుంటూ, రోడ్లపై కాఫీ కప్పులు కడుగుతూ, తినుబండా రాలు అమ్ముతూ, వయసుకు మించిన పనుల్లో నిరుపేద పిల్లలు పనిచేస్తున్నారు.

సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు పూనుకోవాలి. మనం చేసే ఈ ప్రయత్నం బాలల బంగారు భవితకు పునాది కావాలి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేయి కలపాలి. బాల కార్మికులు లేని ప్రపంచం కోసం పాటుపడదాం.
 
 బి. వెంకటేష్
 (నేడు నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం)
 వ్యాసకర్త తెలంగాణ విద్యార్థి వేదిక కార్యదర్శి, మహబూబ్‌నగర్. 8501867878

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement