సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఆయన తాను ప్రసంగించిన వీడియో విడుదల చేశారు. ఇందులో అంబటి ఏమన్నారంటే..
- ప్రపంచవ్యాప్తంగా మానవాళి క్లిష్ట పరిస్థితిలో ఉంది. అందరూ కోవిడ్‌పై తీవ్ర పోరాటం చేస్తున్నారు.
- రాజకీయాల గురించి చాలాసార్లు, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే.. కోవిడ్ సమయంలోనూ చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ నేతలతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని దూషిస్తున్నారు.
- 25 లక్షల మంది పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే బాబు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి రాక్షసానందాన్ని అనుభవిస్తున్నారు.
- వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకమా, పేద ప్రజానీకానికి వ్యతిరేకమా అనేది బాబు ఆలోచించుకోవాలి.
ఇప్పుడూ నీచ రాజకీయాలా?
Published Wed, Mar 25 2020 5:20 AM | Last Updated on Wed, Mar 25 2020 5:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment