మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
సాక్షి, విజయవాడ: విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కేంద్ర బడ్జెట్‌లో లేకపోవడం అందరిని నిరాశ పరిచిందని వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఆజ్ఞతవాసిలా వ్యవహరించారని విమర్శించారు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తేకుండా అజ్ఞాతంలో ఉంటూ తమ అనుకూల మీడియాలో లీకులిస్తున్నారని, తాజాగా బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముందునుంచి వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. ఏప్రిల్ 5లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారన్నారు. రాజీనామాలు కాదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ కళ్యాణ్ ఉచిత సలహా ఇచ్చారని, ఆయన సలహాను సైతం తీసుకుని అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పామన్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీకి చెప్పాలన్నారు. హోదా కోసం అందరూ ఒక్కటై పోరాడాలని బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment