తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సబ్జెక్ట్‌తో పాటు పార్టీ విధానం కూడా లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాలు అంటే రెచ్చగొట్టడం కాదనే విషయం పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. అసలు రాబోయే తరాలకు పవన్ ఏం చెప్పదల్చుకున్నారని బొత్స ప్రశ్నించారు.
‘పవన్‌కు సబ్జెక్ట్ లేదు.. పార్టీ విధానం లేదు. కేఏ పాల్‌కి పవన్ కల్యాణ్‌కు తేడా కనిపించడం లేదు. నిన్ను ఎవడు అడ్డుకుంటాడు.. సన్నాసి మాటలు ఎందుకు?, రాజ్యాంగం, చట్టం అంటే పవన్‌కు తెలియదు. రాజ్యాంగం, విలువలు తెలిస్తే అలాంటి సన్నాసి మాటలు అతని నోటి వెంట రావు. మాట్లాడకూడని మాటలు ఆయన మాట్లాడుతున్నారు.
ఏమీలేని ఇస్తరాకు లాగ ఎగిరెగిరి పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా పాలన సాగుతోంది.ఎస్సీలకు జగన్ హయాంలో ఎంతమేర లబ్ది చేకూరిందో తెలుసుకోవాలి. డీబీటీ ద్వారా పేదలకు నిధులను అందిస్తున్నాం. అవేమీ తెలుసుకోకుండా వాళ్లని కొడతా, వీళ్లని కొడతా అంటే సరిపోతుందా?, ఇలాంటి మాటల ద్వారాఈ సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావ్? , మా పార్టీ విధానం వికేంద్రీకరణే.
మూడు ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్నది మా లక్ష్యం. మూడు రాజధానులు, 26 జిల్లాలు మా విధానం. ఐదుకోట్ల ప్రజల అభివృద్ధి మా విధానం.ఈ విషయం ఇంతకుముందూ చెప్పాం, ఇప్పుడూ చెప్తున్నాం.పవన్ లాంటి వ్యక్తులను చూస్తుంటే ఈ రాజకీయాలపై విరక్తి కలుగుతోంది. చంద్రబాబు, పవన్‌లకు ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే చాలు. వారిది దోపిడీ విధానం, మాది అభివృద్ధి విధానం’ అని బొత్స తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment