మహారాణిపేట(విశాఖ దక్షిణ): అమరావతి ఏకైక రాజధాని కావాలని కోరుతున్న విశాఖ నుంచి ఎన్నికైన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. అప్పుడు అమరావతి కావాలో, విశాఖ కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అమరావతి రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు చేపడుతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే టీడీపీ నేతలు భరించలేకపోతున్నారు.
► టీడీపీ నేతలతో పాటు బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు సీఎం జగన్‌పై అభాండాలు వేస్తున్నారు.
► సీఎం ఏ ఒక్క ప్రాంతం కోసమో, వర్గం కోసమో పనిచేయడం లేదు. 13 జిల్లాల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.
► అధికార వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఉద్దే శంతోనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ముం దుకు వెళ్తున్నారు. విశాఖ రాజధాని అయి తీరుతుంది.
► రూ. 200 కోట్లతో 1,088 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తే అందులో రూ. 300 కోట్ల అవినీతి అనడం విడ్డూరంగా ఉంది.
► అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్‌కు ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి మాత్రం తీరిక లేదా?
► సీఎంపై మాజీ మేయర్ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. హరి తన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి.
దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలి
Published Mon, Jul 6 2020 4:39 AM | Last Updated on Mon, Jul 6 2020 7:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment