131వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Prajasanakalpayatra 131th Day Starts | Sakshi
Sakshi News home page

131వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Sun, Apr 8 2018 8:49 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

Prajasanakalpayatra 131th Day Starts - Sakshi

సాక్షి, తెనాలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ పాదయాత్రను తెనాలి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కఠెవరం, సోమసుందరపాలెం క్రాస్‌ మీదుగా పాదయాత్ర కంచర్లపాలెంకు చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.30కు ప్రారంభమౌతుంది. జాషువా నగర్, నందివెలుగు, కొలకలూరు క్రాస్‌, చింతలపూడి, దుగ్గిరాల మీదుగా మంచికలపూడి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement