సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఆయన ప్రచారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగింది. కానీ బుధవారం ఆయన ఛోటా ఉడేపూర్ జిల్లాలో పొరపాటున లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు.
యువతతో ముచ్చటించేందుకు జిల్లాలో ఆయన 'సంవాద్' పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అనంతరం ఆయన టౌన్‌హాల్ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్ టాయ్‌లెట్‌లోకి ప్రవేశించారు. అయితే, అక్కడ మహిళలా టాయ్‌లెటా? లేక పురుషులదా? అన్న సంకేత బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో 'మహిళల మరుగుదొడ్డి' అని రాసి ఉంది. రాహుల్‌కు గుజరాతీ చదవడం రాకపోవడంతో ఆయన మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లిన వెంటనే ఈ ఘటనను కవర్ చేసేందుకు అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులను ఆయన ఎస్పీజీ సిబ్బంది చెల్లాచెదురు చేసింది. అయినా, కొందరు మీడియా ప్రతినిధులు ఈ ఘటనను తమ కెమెరాలో బంధించారు. లేడీస్ టాయ్‌లెట్ నుంచి రాహుల్ బయటకు రాగానే.. అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా నవ్వారు.
Comments
Please login to add a commentAdd a comment