సాక్షి, హైదరాబాద్ : స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధాని విషయంలో రాజీపడింది ఎవరనీ.. ఓటుకు కోట్లు కేసుతో అమరావతికి పారిపోయి వచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రాజెక్ట్‌లపై కేసీఆర్‌ను చంద్రబాబు ఏనాడైనా నిలదీశారా? మోదీకి భయపడి రాష్ట్ర ప్రయోజనాలను వదులుకున్నది చంద్రబాబు కాదా? హోదాపై నీతి అయోగ్ చెప్పిన ప్రకారమే చంద్రబాబు నడుచుకున్నారు. హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలనీ మోదీ ముందు సాగిలపడింది చంద్రబాబు కాదా? ఐదేళ్ల పాటు నోరుమూసుకుని కూర్చన్న పిరికివాడు చంద్రబాబు.. గుంటనక్క సీఎంగా ఉన్నచోట ఎవరు సహాయం చేయరు.
ఐదేళ్ల పాటు ఏమైంది మీ పౌరుషం? గులాబీ కండువా చాటున దాచారా? లేక కాషాయం కండువా చాటున దాచారా? చంద్రబాబు తన బినామీలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి పంపారు. గతంలో కేసీఆర్‌ను పొగిడిన వారే ఇప్పుడు రంకెలు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. జగన్‌మోహన్ రెడ్డి పోరాటాలతోనే హోదా అంశం సజీవంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం అన్ని రాష్ట్రాల మద్దతు కూడగడతాం’ అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment