అనుష్కపై రణ్‌వీర్‌ రోత వ్యాఖ్యలు.. వైరల్‌! | Old Video of Ranveer Indecent Comments Goes Viral | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 12 2019 6:00 PM | Last Updated on Sat, Jan 19 2019 7:54 PM

Old Video of Ranveer Indecent Comments Goes Viral - Sakshi

ముంబై : టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ల పుణ్యమా.. ఇప్పుడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సైతం ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్‌ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బీసీసీఐ వీరిపై సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది. ఇప్పుడూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడంతో సెలబ్రిటీలు గతంలో ఒళ్లు మరచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 2011లో బాలీవుడ్‌ నటి అనుష్కశర్మతో కలిసి ఇదే కరణ్‌ జోహర్‌ షోలో పాల్గొన్న రణ్‌వీర్‌ సింగ్‌ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

కరీనా స్విమ్‌ చేయడం చూస్తే చిన్నతనంలోనే మూడ్‌ వచ్చేదని అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగకుండా అనుష్కకు గిల్లించుకోవాలని ఉంటే గిల్లుతానని అశ్లీలంగా మాట్లాడాడు. అప్పుడు ఇంతగా సోషల్‌ మీడియా ప్రభావం లేకపోవడంతో బతికిపోయిన రణ్‌వీర్‌.. ఇప్పుడు పాండ్యా, రాహుల్‌ల వల్ల దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లు రణ్‌వీర్‌సింగ్‌పై మండిపడుతున్నారు. ఒక్క రణ్‌వీర్‌పైనే కాదు కరణ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలను సమర్థించేలా కరణ్‌ నవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సోయిలేకుండా మాట్లాడిన పాండ్యా, రాహుల్‌లు వారు బుక్‌ అవ్వడం కాకుండా ఇతర సెలబ్రిటీలను అడ్డంగా బుక్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement