డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్ | Ajay Jayaram, RMV Gurusaidutt reach quarter-finals of Dutch Open | Sakshi
Sakshi News home page

డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్

Published Sun, Oct 11 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

Ajay Jayaram, RMV Gurusaidutt reach quarter-finals of Dutch Open

 అల్మెరి (నెదర్లాండ్స్): డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకోవడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ అజయ్ జయరామ్ మరో విజయం దూరంలో ఉన్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జయరామ్ 21-14, 21-15తో గో సూన్ హువాట్ (మలేసియా)పై విజయం సాధించాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జయరామ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. ఇటీవలే కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన జయరామ్ అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. తొలి గేమ్‌లో ఆరంభం నుంచి ఆధిక్యంలో నిలిచిన జయరామ్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో 2-6తో వెనుకబడిన జయరామ్ ఆ వెంటనే తేరుకున్నాడు. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 12వ సీడ్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో అజయ్ జయరామ్ తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement