న్యూఢిల్లీ: మరో టీమిండియా క్రికెటర్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఉన్న అజింక్యా రహానే తండ్రి అయ్యాడు. అతని భార్య రాధికా ధోపావ్‌కర్ శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముందుగా రహానేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘ కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు చిన్న ప్రిన్స్‌కు కూడా కంగ్రాట్స్. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడు జీవితంలో సరదా పార్ట్ మొదలైంది’ అని హర్భజన్ పేర్కొన్నాడు.
తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికాను ఐదేళ్ల క్రితం రహానే వివాహం చేసుకున్నాడు. తొలుత స్కూల్ మేట్స్‌గా ఆరంభమైన వీరి ప్రయాణం.. ఆపై ఫ్రెండ్‌షిప్‌కు దారి తీసింది. అది మరింత బలపడి ప్రేమకు దారి తీసింది. దాంతో రహానే-రాధికలు కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క‍్రమంలోనే 2014లో రహానే-రాధికలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment