ఆలిండియా చెస్‌ టోర్నీ ప్రారంభం | all india chess tourney started | Sakshi
Sakshi News home page

ఆలిండియా చెస్‌ టోర్నీ ప్రారంభం

Published Fri, Aug 4 2017 12:17 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

ఆలిండియా చెస్‌ టోర్నీ ప్రారంభం

ఆలిండియా చెస్‌ టోర్నీ ప్రారంభం

రాయదుర్గం: ‘నిథమ్‌’ ఆలిండియా ఓపెన్‌ ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ గురువారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని నిథమ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌) ప్రాంగణంలో ఆరు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) నిర్వహిస్తోన్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 లక్షలు. తెలంగాణతోపాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, హరియాణా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, గోవా, తమిళనాడు, రైల్వేస్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన మొత్తం 360మంది క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడుతున్నారు.

 

అంతర్జాతీయ మాస్టర్లు రాహుల్‌ సంగ్మా (రైల్వేస్‌), చక్రవర్తి రెడ్డి (తెలంగాణ), ఆర్‌. బాల సుబ్రమణియం (తమిళనాడు) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ఐదుగురు ‘ఫిడే’ మాస్టర్లు, టాప్‌ సీడ్‌ జె. సాయి అగ్ని జీవితేశ్‌ పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి భాగ్యనగరం స్పోర్ట్స్‌ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిథమ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. చిన్నం రెడ్డి, టీఎస్‌సీఏ కార్యదర్శి కె.ఎస్‌. ప్రసాద్, ఉపాధ్యక్షులు శివప్రసాద్, కోశాధికారి అంజయ్య, కార్య నిర్వాహక కార్యదర్శి సయ్యద్‌ ఫయాజ్, నిథమ్‌ అధికారులు, చెస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement