తిరువనంతపురం: రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓడిపోయింది. ఆంధ్ర జట్టు నిర్దేశించిన 42 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ నష్టపోయి అధిగమించిన కేరళ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 102/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు మరో 13 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 45 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా... మిగతా రెండు వికెట్లు అక్షయ్ ఖాతాలోకి వెళ్లాయి.
జగదీశన్ సెంచరీ...
తిరునల్వేలి: హైదరాబాద్, తమిళనాడు జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అభినవ్ ముకుంద్ (178; 25 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్‌కుతోడు జగదీశన్ (131 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాధించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 409 పరుగులు చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 565/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. రెండు జట్ల ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడం, ఏ జట్టుకూ ఆధిక్యం లభించనందుకు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఆంధ్ర పరాజయం
Published Fri, Nov 16 2018 1:42 AM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment