రన్నరప్ ఆంధ్రప్రదేశ్ | Andhra Pradesh, the teams were satisfied with the runner-up trophyies | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఆంధ్రప్రదేశ్

Published Tue, Oct 8 2013 11:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Andhra Pradesh, the teams were satisfied with the runner-up trophyies

సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్లు రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాయి. మంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల, జూనియర్ బాలబాలికల విభాగాల ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్లు ఓటమి పాలయ్యాయి. ‘చద్దా కప్’ కోసం జరిగిన మహిళల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 0-2తో కేరళ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
 
  తొలి సింగిల్స్‌లో ఆర్తీ సారా 21-18, 21-12తో వృశాలిపై... డబుల్స్‌లో ఆర్తీ సారా-శ్రుతి 21-12, 21-12తో పూజ-సోనికా సాయిలపై గెలిచారు. ‘నారంగ్ కప్’ కోసం జరిగిన బాలుర ఫైనల్స్‌లో కేరళ 2-0తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో అరుణ్ జార్జి 21-6, 21-17తో బాలూ మహేంద్రపై; డబుల్స్‌లో అరుణ్ జార్జి-శ్యామ్ ప్రసాద్ 21-17, 21-15తో కేపీ చైతన్య-గంగాధర రావులపై నెగ్గారు.

‘షఫీ ఖురేషీ కప్’ కోసం జరిగిన బాలికల ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ 1-2తో కర్ణాటక చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో వృశాలి 21-16, 21-14తో శిఖా గౌతమ్‌పై నెగ్గి ఆంధ్రప్రదేశ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అయితే డబుల్స్ మ్యాచ్‌లో పూజ-సోనికా సాయి జోడి 13-21, 18-21తో శిఖా గౌతమ్-మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1-1వద్ద సమమైంది. నిర్ణాయక రెండో సింగిల్స్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కె.శ్రీ కృష్ణప్రియ 21-15, 22-24, 16-21తో మహిమా అగర్వాల్ చేతిలో ఓడిపోవడంతో రాష్ట్ర జట్టు ఓటమి ఖాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement