బాడీబిల్డర్‌ రవి కుమార్‌కు స్వర్ణం | Bodybuilder Ravi Kumar Wins Gold Medal | Sakshi
Sakshi News home page

బాడీబిల్డర్‌ రవి కుమార్‌కు స్వర్ణం

Published Tue, Oct 1 2019 10:00 AM | Last Updated on Tue, Oct 1 2019 10:00 AM

Bodybuilder Ravi Kumar Wins Gold Medal - Sakshi

గుంటూరు వెస్ట్‌: ఆసియా జూనియర్‌ బాడీబిల్డింగ్, ఫిజిక్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిశ్శంకరరావు రవి కుమార్‌ మెరిశాడు. ఇండోనేసియాలోని బెట్టాంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో గుంటూరుకు చెందిన రవి కుమార్‌ 75 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.

తద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాడీబిల్డర్‌గా ఘనత వహించాడు. ఈ సందర్భంగా రవి కుమార్‌కు గుంటూరు జిల్లా బాడీ బిల్డింగ్‌ సంఘం కార్యదర్శి, కోచ్‌ జి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement