మెల్‌బోర్న్: కొన్ని రోజుల క్రితం టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన ఆసీస్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పలు ఫన్నీ వీడియోలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. కూతురితో ‘షిలాకీ జవానీ’ పాటకు స్టెప్పులు దగ్గర్నుంచీ, సూపర్ హిట్ తెలుగు మూవీ అల వైకుంఠపురంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు భార్యతో కలిసి చేసి వార్నర్ చేసి డ్యాన్స్ చేసిన వీడియో వరకూ అభిమానుల్లో ఫుల్ జోష్‌ను నింపాయి. అయితే తాజాగా తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టును ఎంపిక చేశాడు వార్నర్. ఇందులో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చిన వార్నర్.. సహచర సన్‌రైజర్స్ ఆటగాడు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ బెయిర్ స్టోకు అవకాశం ఇవ్వలేదు. తనతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాన్ని రోహిత్‌కు ఇచ్చాడు. ఇక వార్నర్ ప్రకటించిన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టులో ఎనిమింది భారత క్రికెటర్లు ఉండటం విశేషం.. ఇందులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, జస్‌ప్రీత్ బుమ్రా, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రాలకు చోటిచ్చిన వార్నర్.. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ లేదా చహల్‌ల్లో ఒక్కరికి ఎలెవన్‌లో అవకాశం ఇస్తానన్నాడు. (ఆ రచ్చ ఇప్పుడెందుకో..?)
ఓపెనర్‌గా రోహిత్, మూడో స్థానంలో కోహ్లి, నాల్గో స్థానంలో సురేశ్ రైనా, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో మ్యాక్స్‌వెల్‌లకు చోటిచ్చాడు. ఇక ధోనికి ఏడో స్థానాన్ని కేటాయించడంతో పాటు వికెట్ కీపర్ బాధ్యతను కూడా అప్పచెప్పాడు. పేస్ బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు అవకాశం ఇచ్చిన వార్నర్.. భారత్ నుంచి నెహ్రా, బూమ్రాలను ఎంపిక చేశాడు. కాగా, పలువురు స్టార్ ఆటగాళ్లకు వార్నర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టులో చోటివ్వలేదు. ఇందులో యువరాజ్ సింగ్, కీరోన్ పొలార్డ్, లసిత్ మలింగాలను వార్నర్ పరిగణలోకి తీసుకోలేదు. కరోనా వైరస్ కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి29వ తేదీన ఐపీఎల్-13వ సీజన్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తొలుత ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఐపీఎల్ షెడ్యూల్ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దాంతో ఈ లీగ్ ఇక జరగడం దాదాపు అసాధ్యంగానే మారింది. (పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో)
వార్నర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు ఇదే..
డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఎంఎస్ ధోని, మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, కుల్దీప్ యాదవ్/ చహల్
Comments
Please login to add a commentAdd a comment