న్యూసౌత్‌వేల్స్: పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ప్రేక్షకాదరణ ఉంది. భారత క్రికెట్‌లో చెరగని ముద్ర వేసి తనదైన మార్కుతో చెలరేగిపోతున్న కోహ్లి ఆటకు ఫిదా కాని అభిమాని ఉండడు. ఇప్పుడు ఆ జాబితాలో ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇవీమి కూడా చేరిపోయింది. డేవిడ్ వార్నర్ కూడా మేటి క్రికెటరైనా కూడా కూతురు మాత్రం విరాట్ కోహ్లి పేరునే జపిస్తుందట. ఈ విషయాన్ని వార్నర్ భార్య కాండైస్ వార్నర్ స్పష్టం చేశారు.
తమ కూతురు తరచు ఐయామ్ విరాట్ కోహ్లి అంటూ జపం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇవేమి బ్యాట్ పట్టుకుని బంతిని హిట్ చేసే సమయంలో ఐయామ్ విరాట్ కోహ్లి అంటున్న వీడియోను కాండైస్ షేర్ చేశారు. సరదాగా క్రికెట్ ఆడే సమయంలో ఐయామ్ కోహ్లి అంటూ ఉంటుందని వెల్లడించారు. ఈ విషయాన్ని కాండైస్ వార్నర్ తన ట్వీటర్ అకౌంట్‌లో తెలియజేశారు. ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు. తమ చిన్నారి భారత్‌లో ఎక్కువ సమయం ఉండటంతో కోహ్లిలా ఉండాలనుకుంటుందని పేర్కొన్నారు.
ఐపీఎల్‌లో కోహ్లి 177 మ్యాచ్‌ల్లో 5,412 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, వార్నర్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వార్నర్ 126 మ్యాచ్‌ల్లో 4,706 పరుగులు చేశాడు. 2014 నుంచి పరుగుల వీరుల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచిన వార్నర్.. 2015 ఐపీఎల్‌లో 562 పరుగులతో అగ్రస్థానాన్ని సాధించాడు. ఇక్కడ ఏబీ డివిలియర్స్, కోహ్లిల కంటే కూడా వార్నర్ అత్యధిక పరుగులు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి 973 పరుగులతో టాప్‌లో నిలవగా, 848 పరుగులతో వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు. 2017లో వార్నర్ 641 పరుగులతో టాప్ ప్లేస్‌ను దక్కించున్నాడు. కాగా, నిషేధం కారణంగా 2018 ఐపీఎల్ సీజన్‌కు వార్నర్ దూరం కాగా, 2019లో 692 పరుగులతో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
This little girl has spent too much time in India. Wants to be @imVkohli pic.twitter.com/Ozc0neN1Yv
— Candice Warner (@CandyFalzon) November 10, 2019
Comments
Please login to add a commentAdd a comment