ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి మహిళల టెన్నికాయిట్ టైటిల్‌ను నిరుటి విజేత సెయింట్ ఆన్స్ కాలేజి నిలబెట్టుకుంది. సింగిల్స్, డబుల్స్‌లో ఎం.సరిత (సెయింట్ ఆన్స్) సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి మైదానంలో జరిగిన ఫైనల్లో సెయింట్ ఆన్స్ 21-18, 21-19 స్కోరుతో కస్తూర్బా గాంధీ కాలేజిపై నెగ్గింది.
సింగిల్స్ విభాగంలో సరిత 21-10, 21-12తో ఎ.హిందూజ (కస్తూర్బా గాంధీ కాలేజి)పై గెలిచింది. డబుల్స్ ఫైనల్లో సరిత, నిఖిత జోడి 21-15తో ఎ.హిందూజ, పి.దీప్తి జోడిపై గెలిచింది. డబుల్స్‌లో మూడో స్థానం సునీత, రచన జోడి (సెయింట్ ఆన్స్ కాలేజి) పొందింది. ముగింపు కార్యక్రమానికి భారత టెన్నికాయిట్ జట్టు కోచ్ ఎన్.సద్గురు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ టి.ఎం.శేఖర్ రావు అధ్యక్షత వహించారు, ఫిజికల్ డెరైక్టర్లు డాక్టర్ ఉమారావు, అన్నామేరీ తదితరులు పాల్గొన్నారు.
సరిత డబుల్ ధమాకా
Published Sun, Sep 29 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement