ఇంగ్లండ్‌ 67కే ఆలౌట్‌ | England Bowled Out At 67 Runs Against Australia | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 67కే ఆలౌట్‌

Published Sat, Aug 24 2019 9:56 AM | Last Updated on Sat, Aug 24 2019 10:09 AM

England Bowled Out At 67 Runs Against Australia - Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌ చెత్త ప్రదర్శనతో కుప్పకూలింది. దీంతో యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టు రెండోరోజే ఆస్ట్రేలియా చేతిలోకొచ్చింది. శుక్రవారం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. టెస్టుల్లో ఇంగ్లండ్‌ జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. డెన్లీ (12) ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌. హాజల్‌వుడ్‌ (5/30), కమిన్స్‌ (3/23), ప్యాటిన్సన్‌ (2/9) ఇంగ్లండ్‌ను హడలెత్తించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం పొందిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. మొత్తం 283 పరుగుల ఆధిక్యంలో ఉంది.   అంతకుముందు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/45) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement