కేఎల్ రాహుల్
ముంబై : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల కోసం తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్లలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ పేరు ఉండటంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాహుల్‌ను ఎంపిక చేయటం ఏంటని, ఇంకెన్ని అవకాశాలు కల్పిస్తారని భారత సెలక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం టీ20ల్లోనైనా రాహుల్‌ను తీసేసి.. రాయుడు లేదా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న రాహుల్‌పై అభిమానులు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సైతం రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2, 44, 2, 0 దారుణంగా విఫలమయ్యాడు. అయినా అదృష్టవశాత్తు రాహుల్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుంది. ఇంగ్లండ్ గడ్డపై టీ20 సెంచరీ మినహా రాహుల్ ఆ తరహా ప్రదర్శన కనబర్చలేదు. ప్రతీ మ్యాచ్‌లో విఫలమవుతూ అభిమానుల ట్రోలింగ్ గురవుతున్నాడు. అయినప్పటికీ అనూహ్యంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.
రాహుల్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. రాహుల్ వెంటనే భారత్ వచ్చేసి డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఉత్తమమని సలహా ఇచ్చాడు. అభిమానులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లకు రాహుల్ ఎంపికవ్వడం అతనికే నష్టమని, ఈ సిరీస్‌ల్లో అతను బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఎంపిక కాకపోతే కనీసం రంజీ మ్యాచ్‌ల్లోనైనా ప్రాక్టీస్ లభించేదని కామెంట్ చేస్తున్నారు.
KL Rahul?? Man this guy will neither play on d series nor is bcci letting him play Ranji! Horrible decision
— Adil Mohammed (@Adil_888) December 24, 2018
@BCCI - Whats the use of taking KLRahul
— jatin nahar (@jatinnahar) December 24, 2018
Iyer /Rayudu instead of KL Rahul in T20. Drop KL
— mukesh jaisingh (@mukesh_jaisingh) December 24, 2018
Comments
Please login to add a commentAdd a comment