న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఆల్ టైమ్ అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేశాడు. తన అత్యుత్తమ టెస్టు ఎలెవన్‌లో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలకు భజ్జీ చోటివ్వలేదు. ప్రధానంగా అంతర్జాతీయ కెరీర్‌లో తనతో పాటు ఆడిన క్రికెటర్లకే భజ్జీ ప్రాధాన్యత ఇచ్చాడు. టెస్టు ఎలెవన్‌లో ముగ్గురు భారత క్రికెటర్లకే చోటు దక్కింది.(హార్దిక్ చితక్కొట్టుడు మామూలుగా లేదు!)
ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ద వాల్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లకు చోటిచ్చాడు. తన టెస్టు జట్టులో భారత్ బౌలింగ్ యూనిట్ నుంచి ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. ప్రధానంగా ఆసీస్ దిగ్గజ ఆటగాళ్లు గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్‌ను ఎంపిక చేశాడు. ఇక పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్‌కు భజ్జీ చోటు కల్పించాడు. వికెట్ కీపర్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కారాను ఎంపిక చేసుకున్నాడు. టెస్టు ఆల్ రౌండర్ కోటాలో జాక్వస్ కల్లిస్‌ను తీసుకున్నాడు. ఇక్కడ కెప్టెన్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌ను ఎంపిక చేశాడు.
హర్భజన్ సింగ్ టెస్టు ఎలెవన్
రికీ పాంటింగ్(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, జాక్వస్ కల్లిస్, కుమార సంగక్కారా, షాన్ పొలాక్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్
Comments
Please login to add a commentAdd a comment