![IND Vs NZ: Team India Stutter After Brisk Start - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/31/Kohli1.gif.webp?itok=0gsl0Jt1)
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాల్గో టీ20లో టీమిండియా ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఏడు ఓవర్లు ముగియకుండానే సంజూ శాంసన్(8), కోహ్లి(11), అయ్యర్(1) వికెట్లను చేజార్చుకుంది. తొలి వికెట్‌గా శాంసన్ పెవిలియన్ చేరితే, రెండో వికెట్‌గా కోహ్లి ఔటయ్యాడు. శాంసన్ ఔటైన తర్వాత వచ్చిన కోహ్లి రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. (ఇక్కడ చదవండి: శాంసన్ ఏందిది..?)
కాగా, 9 బంతులు మాత్రమే ఆడిన కోహ్లి బెన్నెట్ బౌలింగ్‌లో సాన్‌ట్నార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక అయ్యర్ కూడా నిరాశపరిచాడు. 7 బంతులు ఆడి పరుగు మాత్రమే చేసిన అయ్యర్.. ఇష్ సోధీ బౌలింగ్‌లో సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో టీమిండియా 52 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment