భారీ ఆధిక్యం దిశగా భారత్
భారీ ఆధిక్యం దిశగా భారత్
Published Sat, Nov 19 2016 5:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు బ్యాట్స్ మన్లు భారీ స్కోరు సాధిస్తే.. ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి భారత బౌలర్లు మ్యాచ్ లో పైచేయి సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 98/3 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ ఆధిక్యంగా 298 పరుగులకు చేరింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో టీమిండియా టాప్ ఆర్డర్ తడబాటుకు గురై వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(56), అజింక్య రహానే(22)లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టగా అండర్సన్ కు ఒక వికెట్ దక్కింది.
Advertisement