ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ కోల్‌కతాలో | kolkata to host ISl final match | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ కోల్‌కతాలో

Published Fri, Nov 3 2017 10:35 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

kolkata to host ISl final match - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్‌ సాకర్‌ అనూహ్యంగా విజయవంతమైంది. తుదిపోరులో భారత్‌ లేకపోయినా... కోల్‌కతాలో ఇంగ్లండ్, స్పెయిన్‌ల మధ్య జరిగిన ఫైనల్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ టైటిల్‌ పోరునూ కోల్‌కతాకు మార్చేశారు. మొత్తానికి ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌ల వేదికలు మారాయి. కొచ్చిలో తొలి మ్యాచ్‌... కోల్‌కతాలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ రెండు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌డీఎల్‌) తెలిపింది. ఈ నెల 17 నుంచి ఐఎస్‌ఎల్‌ నాలుగో సీజన్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం తొలి మ్యాచే కోల్‌కతాలో జరగాలి. కానీ అదిప్పుడు కొచ్చికి తరలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement