సెంచూరియన్: భారత క్రికెట్‌లో చైనామన్(ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్) బౌలర్ కుల్దీప్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా కుల్దీప్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ఆరో వన్డేలో వికెట్ తీసిన కుల్దీప్.. ఈ వన్డే సిరీస్‌లో 17వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో స్పిన‍్నర్‌గా గుర్తింపు సాధించాడు.
ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో సఫారీలపై వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా చూస్తే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వన్డే వికెట్లు సాధించిన స్పిన్నర్లలో అమిత్ మిశ్రా(భారత్) అగ్రస్థానంలో ఉన్నాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో మిశ్రా 18 వికెట్లను సాధించాడు. ఆ తర్వాత కుల్దీప్ రెండో స్సిన్నర్‌గా మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ మూడో స్థానంలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 16 వికెట్లతో ఉన్నాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రషీద్ ఖాన్ విశేషంగా రాణించాడు. ఇక అతని సరసన భారత స్సిన్నర్ చాహల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో తాజా సిరీస్‌లో చాహల్ 16 వికెట్లను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment