న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే ఈసారి క్రీడా బడ్జెట్ పెరిగింది. శనివారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో క్రీడల అభివృద్ధికి భారీగా నిధులిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను రూ.384 కోట్ల పెరుగుదల కనిపించింది. ఓవరాల్‌గా క్రీడలకు రూ.1,541.13 కోట్లను కేటాయించగా... ఇందులో ప్రణాళికా వ్యయం రూ.1,389.48 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.151.65 కోట్లున్నాయి.
గతేడాది ఈ మొత్తం రూ.1156.61 కోట్లుగా ఉంది. అలాగే ప్రణాళికా వ్యయం కూడా దాదాపు రూ.381 కోట్లు... ప్రణాళికేతర వ్యయం రూ.3.04 కోట్లు పెరిగింది. ఇక ప్రస్తుత క్రీడా బడ్జెట్‌లో రూ.886.57 కోట్లు క్రీడలకు ఖర్చు చేయనుండగా.... రూ.336.62 కోట్లు యువజన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తారు. సాయ్‌కు రూ.369.39 కోట్లు లభించనున్నాయి. జాతీయ క్రీడా సమాఖ్యలకు గతంలాగే రూ.185 కోట్లు కేటాయించారు. ప్రతిభాన్వేషణ, శిక్షణ పథకానికి రూ.5 కోట్లు, డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు రూ.11.60 కోట్లు, జాతీయ డోపింగ్ పరిశోధన ల్యాబొరేటరీకి రూ.8.9 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
భారీగా పెరిగిన క్రీడా బడ్జెట్
Published Sun, Mar 1 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement